Wednesday 24th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘లక్ష్మీదేవి నాలుగు చేతులతో ఎలా పుట్టింది?’ఎస్పీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు!

‘లక్ష్మీదేవి నాలుగు చేతులతో ఎలా పుట్టింది?’ఎస్పీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు!

sp leader

SP Leader Comments | లక్ష్మీ దేవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు యూపీ మాజీ మంత్రి, సమాజ్ వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య. దీపావళి సందర్భంగా దీపోత్సవ కార్యక్రమంలో తన భార్యను సత్కరించారు.

ఈ నేపథ్యంలో ప్రపంచంలోని ప్రతి మతం, కులం, దేశం లో పుట్టిన ప్రతి బిడ్డ రెండు చేతులు, రెండు కాళ్ళు, రెండు చెవులు, రెండు కళ్ళు, రెండు రాంధ్రలతో కూడిన ఒక ముక్కు ఉంటాయి. అలాగే ఒక తల, ఉదరం తో పుడుతారు.

కానీ ఇప్పటివరకు నాలుగు, ఎనమిది, పది, ఇరవై, వెయ్యి చేతులతో ఎవరు పుట్టలేదు, అలాంటప్పుడు లక్ష్మీ దేవి నాలుగు చేతులతో ఎలా పుట్టిందని ప్రశ్నించారు ఈ ఎస్పీ నేత.

మీరు ఒకవేళ లక్ష్మీ దేవిని పూజించాలంటే ఇంట్లో ఉన్న మీ భార్యను పూజించండి అంటూ హితవు పలికారు.

ఎందుకంటే కుటుంబ పోషణ, సంతోషం, శ్రేయస్సు, ఆహారం మరియు సంరక్షణ బాధ్యతలను చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించే మీ భార్యను నిజమైన దేవతగా భావించండి అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు స్వామి ప్రసాద్ మౌర్య.

You may also like
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions