Thursday 19th September 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > BJP సెంటిమెంట్.. ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు ముహూర్తం ఫిక్స్?

BJP సెంటిమెంట్.. ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు ముహూర్తం ఫిక్స్?

ucc

Uniform Civil Code Bill | ప్రస్తుతం దేశం ఆసక్తికరంగా మారిన ఉమ్మడి పౌరస్మృతి (UNIFORM CIVIL CODE) బిల్లుకు కేంద్రం ముహూర్తం ఫిక్స్ చేసిందా.. అతి త్వరలో పార్లమెంట్ ముందుకు తీసుకురానుందా.. అంటే అవుననే సూచనలు వినిపిస్తున్నాయి.

భారతీయ జనతా పార్టీ (BJP) ప్రధాన సైద్ధాంతిక ఎజెండాలో (CORE IDEOLOGY) మూడు అంశాలు ముఖ్యంగా ఉంటాయి.

అవి అయోధ్య రామ మందిరం, జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌరస్మృతి (UNIFORM CIVIL CODE).

దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి నాయకత్వంలో 1999 నుండి 2004 లో బీజేపీ అధికారంలో ఉన్నా వీటిని అమలు చేయలేకపోయింది.

దానికి ప్రధాన కారణం బీజేపీ కి సొంతంగా మెజారిటీ లేకపోవడమే. ఈ మూడింటిని వెంటనే అమలు చేయాలని బీజేపీ కి అమలు చెయ్యాలని కోరిక ఉన్నా ఎన్డీయే కూటమిలోని ఇతర పార్టీలు అంగీకరించలేదు.

కానీ 2014లో బీజేపీ సొంతంగా పార్లమెంట్ లో మెజారిటీ సీట్లను గెలవడం ద్వారా అధికారంలోకి వచ్చింది.
దీంతో 2014 తర్వాత మళ్ళీ ఈ 3 అంశాలు తెరపైకి వచ్చాయి.

అయోధ్య రామ మందిర వివాదం 2019 నవంబర్ 9 చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ ధర్మాసనం తీర్పుతో ముగిసింది.

2020 ఆగస్ట్ 5న ప్రధాని నరేంద్రమోదీ అయోధ్యలో రామ మందిరానికి భూమి పూజ నిర్వహించారు. అంతకు ముందు 2019 ఆగస్ట్ 5న జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే ఆర్టికల్ 370ను రద్దు చేశారు.

దీంతో బీజేపీకి ఉన్న ప్రధాన సైద్ధాంతిక అజెండా లోని మూడు అంశాల్లో మొదటి రెండు అంశాలు పూర్తి అయ్యాయి.

Uniform Civil Code Bill | ఇప్పుడు మిగిలింది కేవలం ఉమ్మడి పౌరస్మృతి బిల్లు. ప్రస్తుతం ఉమ్మడి పౌరస్మృతి గురుంచి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది.

దానికి ప్రధాన కారణం బీజేపీ సభ్యులు ప్రతి సభలో ఉమ్మడి పౌరస్మృతి గురించి మాట్లాడటం. ఇటీవల భోపాల్ లో జరిగిన సభలో కూడా ప్రధాని నరేంద్రమోదీ ఉమ్మడి పౌరస్మృతి ప్రస్తావన తీసుకొచ్చారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అమలు చేసి తీరుతాం అని బీజేపీ వర్గాలు బలంగా చెప్తున్నాయి. ప్రతి ఎన్నికల్లో బీజేపీ భావోద్వేగ అంశాలతో రంగంలోకి దిగుతుంది.

2014, 2019 ఎన్నికల్లో అయోధ్య రామ మందిరం, ఆర్టికల్ 370 రద్దు అంశాల చుట్టూ బీజేపీ తమ ప్రచారాన్ని చేసింది.

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు తో రాబోయే 2024 ఎన్నికలకు బీజేపీ వద్ద మిగిలి ఉన్న ఏకైక ఆయుధం ఉమ్మడి పౌరస్మృతి. ఇప్పుడు బీజేపీ ఉమ్మడి పౌరస్మృతి ముందు పెట్టి ఎన్నికలకు వెళ్లాలని చూస్తుంది.

ఉమ్మడి పౌరస్మృతి అంటే ప్రస్తుతం భారతదేశంలో ఎవరు నేరం చేసిన వారి మతం, కులం, లింగం తో సంబంధం లేకుండా ఒకేరకమైన శిక్షను విధిస్తారు.

కానీ పౌర చట్టం (CIVIL LAW) ప్రకారం వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత, తల్లిదండ్రులు చనిపోతే పిల్లల నిర్వహణ అనే అంశాలు న్యాయస్థానానికి వస్తే వారి మతం ఆధారంగా తీర్పును ఇస్తారు.

బహుభార్యత్వం అనేది ఒక మతం లో నేరం, మరో మతంలో సాధారణ విషయం.

అలాగే విడాకులు అనేది కూడా వివిధ మతల్లో భిన్నంగా ఉంటుంది. వారసత్వం అనేది కూడా ఒక మతంలో ఒకలాగా మరో మతంలో మరోలాగా ఉంటుంది.

ఇలా మతం ఆధారంగా కాకుండా ప్రజలందరికీ ఒకేరకమైన చట్టం ఉండలనేదే ఉమ్మడి పౌరస్మృతి.
ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.

జులై 20నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలు కానున్నాయి. ఆగస్ట్ 5 సెంటిమేంట్ ఉన్న బీజేపీ
2023 ఆగస్ట్ 5న ఉమ్మడి పౌరస్మృతి బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెడుతుందా అనే సందేహం ప్రతిపక్షాలకు వస్తుంది.

కానీ ఉమ్మడి పౌరస్మృతిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాని ప్రతిపక్షంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన (ఉద్ధవ్ వర్గం), బిజుజనతాదళ్ పార్టీలు ఉమ్మడి పౌరస్మృతికి మద్దతు తెలిపాయి.

లోకసభలో బీజేపీకి మెజారిటీ ఉంది కాని రాజ్యసభలో బిల్లు ఆమోదించాలంటే 119 మంది సభ్యుల మద్దతు ఉండాలి.

కానీ ప్రస్తుతం బీజేపీ మరియు దాని మిత్రపక్షాలు కలిపి 108 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు.

వ్యతిరేకిస్తున్న విపక్షాలు..

ఓవైపు యూసీసీ బిల్లును ప్రవేశ పెట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తుంటే, దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, కాంగ్రెస్, ఆర్జెడీ, డీఎంకే, టీఎంసీ, సమాజ్ వాదీ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి.

భారత దేశంలో రాజ్యాంగం కల్పించిన మతస్వేచ్ఛను ఈ బిల్లు హరిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

అలాగే ఈ ఉమ్మడి పౌరస్మృతి గనుక అమలు అవుతే దేశంలో మతఘర్షనలు పెరుగుతాయని, బీజేపీ అభివృద్ధి చెయ్యలేక మతాల మధ్య విభజన తెచ్చి ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని వారు ఎద్దేవా చేశారు.

ఏది ఏమైనా ఆగస్ట్ 5న ఏం జరుగుతుందో అని దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరి బీజేపీ తన ఆగస్ట్ 5 సెంటిమెంట్ ను కొనసాగిస్తుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

You may also like
Election commission
దేశంలో మరోసారి ఎన్నికల నగరా.. ఆ రాష్ట్రంలో పదేళ్ల తర్వాత ఎన్నికలు!
Modi Cabinet 3.O
Modi Cabinet 3.O: మంత్రులకు కేటాయించిన శాఖలివే!
silver lotus gift to modi
ప్రధాని మోదీకి బహుమతిగా 3 కిలోల వెండి కమలం.. ఎవరిస్తున్నారంటే!
sambit patra
పూరి జగన్నాథుడు ప్రధాని మోదీ భక్తుడు: బీజేపీ నేత వివాదస్పద వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions