Friday 5th June 2026
12:07:03 PM
Home > Uncategorized > 8 ఏళ్ల తైక్వాండో చిచ్చరపిడుగు.. రాష్ట్రస్థాయి పోటీల్లో కాంస్య పతకం!

8 ఏళ్ల తైక్వాండో చిచ్చరపిడుగు.. రాష్ట్రస్థాయి పోటీల్లో కాంస్య పతకం!

praneeth nandan

8 ఏళ్ల తైక్వాండో చిచ్చరపిడుగు.. రాష్ట్రస్థాయి పోటీల్లో కాంస్య పతకం!

Taekwondo Championship | మేడ్చల్-మల్కాజ్ గిరి (Medchel Malkajgiri) జిల్లాలోని ఉప్పల్ కు చెందిన 8 ఏళ్ల కట్కూరి ప్రణీత్ నందన్ తైక్వాండో ఛాంపియన్ షిప్ లో అదరగొట్టాడు.

ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్(Taekwondo Championship) లో పాల్గొని కాంస్య పతకం సాధించాడు. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా తరఫున 3వ తెలంగాణ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ తైక్వాండో ఛాంపియన్షిప్-2025లో సబ్ జూనియర్ బాయ్స్  25 కిలోల విభాగంలో ప్రణీత్ కాంస్య పతకం అందుకున్నాడు.

ఈనెల 12 నుంచి 14 తేదీల్లో జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల్ కేంద్రంలో ఈ పోటీలు జరిగాయి. బోడుప్పల్ లోని పల్లవి మోడల్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న కె.ప్రణీత్ నందన్ గత ఏడాది కాలంగా ఒలింపిక్ క్రీడ అయిన తైక్వాండోలో కోచ్ పితాని చైతన్య దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడు.

ప్రణీత్ నందన్ గతంలో మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల స్థాయి పోటీల్లో పాల్గొని స్వర్ణం, రజత పతకాలూ సాధించాడు. ప్రణీత్ విజయం పట్ల అతడి తల్లిదండ్రులు నిఖిత ప్రసాద్, కోచ్ చైతన్య ఆనందం వ్యక్తం చేశారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions