Graduates Apply For Sweeper Post | దేశంలో నిరుద్యోగ సమస్య ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ రాష్ట్రమైనా ప్రభుత్వ ఉద్యోగాలకు ఉండే పోటీ మరింత తీవ్రం. అయితే పని ఏదైనా ప్రభుత్వ ఉద్యోగమైతే చాలు అనేలా ఉంది యువత తీరు.
హరియాణాలో (Haryana) ఓ జాబ్ నోటిఫికేషన్ కు వచ్చిన దరఖాస్తులే ప్రత్యక్ష నిదర్శనం. రాష్ట్రంలో చాలా మంది అభ్యర్థులు హర్యానా ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, బోర్డులు మరియు పౌర సంస్థల ఆఫీసులను శుభ్రం చేసే స్వీపర్ ఉద్యోగానికి భారీ స్థాయిలో అప్లై చేశారు.
కేవలం స్వీపర్ ఉద్యోగానికి (Sweeper Job) 46 వేల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది గ్యాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకున్నారు. ఇక లక్షా 20 వేల మంది ఇంటర్ చదివిన అభ్యర్థులు అదనం. అయితే ఇది పూర్తిగా పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగం కూడా కాదు.
రాష్ట్ర ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ అయిన హర్యానా కౌశల్ రోజ్‌గార్ నిగమ్ లిమిటెడ్ ద్వారా చేపట్టే కాంట్రాక్ట్ స్వీపర్ ఉద్యోగానికి కూడా అధిక సంఖ్యలో విద్యావంతులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.