Rain Alert For Telangana | గత వారం రోజులుగా భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను (Telangana Rains) ముంచెత్తుతున్నాయి. దీంతో పలు జిల్లాల్లో వరదలు బీభత్స సృష్టించాయి. ముఖ్యంగా ఏపీలో కృష్ణా జిల్లా (Vijayawada Floods), తెలంగాణలో ఖమ్మం జిల్లా వరదలతో (Khammam Floods) తీవ్ర ప్రభావానికి గురయ్యాయి.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ (IMD Hyderabad) తెలంగాణకు మరో రెయిన్ అలర్ట్ ఇచ్చింది. సెప్టెంబర్ 4, 5న భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అదేవిధంగా 6, 7, 8 తేదీల వరకు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలైన మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లిపై ఈ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.