Sunday 8th September 2024
12:07:03 PM
Home > తాజా > హరీష్ రావు కారుపై రాళ్లదాడి..కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్

హరీష్ రావు కారుపై రాళ్లదాడి..కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్

ktr pressmeet

KTR Condems Attack On Harish Rao | ఖమ్మం ( Khammam ) లో వరద బాధితులను పరామర్శించేందుకు మాజీ మంత్రులు హరీష్ రావు ( Harish Rao ), సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ తదితరులు వెళ్లారు.

ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు హరీష్ రావు కారుపై రాళ్లతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ఈ దాడిని ఖండించారు.

దాడి చేయడం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజలకు సాయం చేయడం చేతగాక, సాయం చేస్తున్న వాళ్లను చూసి ఓర్వలేకే ఈ దాడికి తెగబడ్డారని విమర్శించారు.

మీరు ప్రజలను నిర్లక్ష్యం చేస్తే వారికి అండగా ఉండటమే తప్పా? అని ప్రశ్నించారు. ఈ దాడికి ముఖ్యమంత్రి ( Cm Revanth ) సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.

You may also like
ఒకే ఫ్రేమ్ లో సీఎం రేవంత్, బండి సంజయ్
సస్పెన్స్ కు తెర..తెలంగాణకు నూతన పీసీసీ చీఫ్
Rain Alert
తెలంగాణకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక!
హరీష్ రావు కారుపై రాళ్ళ దాడి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions