Saturday 7th September 2024
12:07:03 PM
Home > తాజా > హరీష్ రావు కారుపై రాళ్ళ దాడి

హరీష్ రావు కారుపై రాళ్ళ దాడి

Attack On Harish Rao Car | మాజీ మంత్రి హరీష్ రావు ( Harish Rao ) మరియు బీఆరెస్ నేతల ఖమ్మం ( Khammam )పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఖమ్మం వరద బాధితులను పరామర్శించేందుకు మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ ( Puvvada Ajay ), సబితా ఇంద్రారెడ్డి ( Sabitha Indrareddy ) తదితరులు మంగళవారం ఖమ్మంలో పర్యటించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ( Congress ) మరియు బీఆరెస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు హరీష్ రావు ప్రయాణిస్తున్న వాహనంపై రాళ్లతో దాడి చేశారు.

కారులో హరీష్ రావు, సబితా , పువ్వాడ ఉన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటన బీకే నగర్ లో చోటుచేసుకుంది.

You may also like
ktr pressmeet
హరీష్ రావు కారుపై రాళ్లదాడి..కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్
వరద బాధితులకు రూ.100 కోట్లు..తెలంగాణ ఉద్యోగుల ప్రకటన

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions