Thursday 25th July 2024
12:07:03 PM
Home > తాజా > ఈసారి ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఎత్తు ఎంతంటే!

ఈసారి ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఎత్తు ఎంతంటే!

khairatabad ganesh 2024

Khairatabad Ganesh | అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వినాయక చవితి (Vinayaka Chaturthi) మరో మూడు నెలల్లో రానుంది. ఈ నేపథ్యంలో వినాయక విగ్రహ నిర్మాణాలు భారీగా జరుగుతున్నాయి. ఎంతో ప్రసిద్ధి గాంచిన ఖైరతాబాద్ గణేష్ విగ్రహ రూపకల్పన ప్రారంభం అయింది.

ఈ మేరకు సోమవారం కర్రపూజ చేశారు. ఖైరతాబాద్ గణేష్ మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. కాగా ఈ ఏడాది 70 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

పర్యావరణహిత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మండలి నిర్ణయించింది. ఈ సందర్భంగా మాట్లాడిన దానం నాగేందర్..సంప్రదాయం ప్రకారం కర్రపూజ చేసి విగ్రహ ఏర్పాట్లను ప్రారంభించినట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు దానం నాగేందర్ తెలిపారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions