Monday 2nd November 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఆంధ్రప్రదేశ్‌లో మూడో ప్రత్యామ్నాయంగా కొత్త పార్టీ!

ఆంధ్రప్రదేశ్‌లో మూడో ప్రత్యామ్నాయంగా కొత్త పార్టీ!

vijay Sai Reddy
  • నవంబర్ 11న పేరు వెల్లడిస్తానన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి!

New Political Party In AP ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీలో తాను తీవ్రమైన మనోవేదనకు గురైనట్లు పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర శ్రేయస్సు, అభివృద్ధి లక్ష్యంగా ఏపీలో మూడో ప్రత్యామ్నాయ పార్టీ అవతరించబోతోందని ఆయన ప్రకటించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ నెల 11వ తేదీన తమ కొత్త పార్టీ పేరును అధికారికంగా వెల్లడిస్తానని స్పష్టం చేశారు.

కొత్త పార్టీలోకి ఓవీ రమణ..

టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఓవీ రమణ టీడీపీకి రాజీనామా చేసి, విజయసాయిరెడ్డి స్థాపించబోయే కొత్త పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. విజయసాయిరెడ్డి ఆయనను సాధరంగా పార్టీలోకి స్వాగతించారు. కొత్త పార్టీలో ఓవీ రమణ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. గతంలో తామిద్దరం టీటీడీ బోర్డులో కలిసి పనిచేసిన అనుభవం ఉందని, ఆ అనుభవంతో పార్టీని ముందుకు తీసుకెళతామని ధీమా వ్యక్తం చేశారు.

నవంబర్ 11.. 11:11 ముహూర్తంపై స్పష్టత..

నవంబర్ 11వ తేదీ ఉదయం 11 గంటల 11 నిమిషాలకు కొత్త పార్టీని ప్రకటించడంపై వస్తున్న సోషల్ మీడియా ట్రోల్స్‌పై విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. పండితులు సూచించిన ముహూర్త బలం ప్రకారమే ఆ సమయాన్ని ఎంచుకున్నామని, ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని వివరణ ఇచ్చారు.

భుజాలు తడుముకోవద్దు..

“ఎవరో భుజాలు తడుముకుంటే నేను ఏమీ చేయలేను” అని వ్యాఖ్యానించారు. తాను పార్టీకి మెంటార్‌గా ఉంటూ అన్ని వర్గాల వారికి అధికారం కట్టబెట్టేలా ముందుకు సాగుతానని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో ఏపీలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని, పార్టీ ఆవిర్భావ ప్రకటన తర్వాత అన్ని జిల్లాల నుంచి భారీగా చేరికలు ఉంటాయని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

You may also like
sharmila
బిడ్డ పెళ్లి వేదిక మార్పు.. వైఎస్ షర్మిల భావోద్వేగ ట్వీట్!
pawan kalyan
ఏపీ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరిట నకిలీ వాట్సాప్ ఛానల్!
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు: జనసేన విజ్ఞప్తితో ఈ గుర్తుల తొలగింపు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions