Friday 9th October 2026
12:07:03 PM
Home > తాజా > డెహ్రాడూన్‌లో వింత దొంగతనం.. ఫోన్ కొట్టేసి, పాస్‌వర్డ్ చెప్పమని బాధితురాలికే మెసేజ్‌లు!

డెహ్రాడూన్‌లో వింత దొంగతనం.. ఫోన్ కొట్టేసి, పాస్‌వర్డ్ చెప్పమని బాధితురాలికే మెసేజ్‌లు!

Dehradun iPhone Theft Password Message | ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఒక విచిత్రమైన దొంగతనం సంఘటన వెలుగులోకి వచ్చింది. దొంగిలించిన ఐఫోన్‌ను అన్‌లాక్ చేయలేకపోయిన దొంగ, నేరుగా బాధితురాలికే మెసేజ్‌లు పంపి “ఐఫోన్ పాస్‌వర్డ్ ఇవ్వండి” అని డిమాండ్ చేసిన ఘటన సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది.

డెహ్రాడూన్‌లోని ‘క్లెమెంట్ టౌన్’ ప్రాంతంలో సెప్టెంబర్ 12న తెల్లవారుజామున 4 నుంచి 8 గంటల మధ్య పలు హాస్టళ్లు, పీజీలలో దొంగతనాలు జరిగాయి.

రూ. లక్షల విలువైన వస్తువులు మాయం..

కౌశికి ధ్యానీ (Kaushiki Dhyani) అనే యువతి ఫ్లాట్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో లక్షలాది రూపాయల విలువైన ఐఫోన్లు, మెక్‌బుక్‌లు, ల్యాప్‌టాప్‌లు దొంగతనానికి గురయ్యాయి. దొంగిలించిన ఐఫోన్ లాక్ స్క్రీన్‌పై అత్యవసర కాంటాక్ట్ నంబర్ (Lost Mode Contact) కనిపిస్తుండటంతో, దొంగ ఆ నంబర్‌ను సేకరించి బాధితురాలికి వాట్సాప్ మరియు SMSల ద్వారా “పాస్‌వర్డ్ చెప్పండి” అని సందేశాలు పంపడం ప్రారంభించాడు.

పోలీసుల నిర్లక్ష్యంపై బాధితుల ఆగ్రహం..

దొంగలు నేరుగా తమను సంప్రదిస్తున్న ఆధారాలు (స్క్రీన్‌షాట్‌లు), సీసీటీవీ ఫుటేజ్‌లు ఇచ్చినప్పటికీ పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని కౌశికి ధ్యానీ తన ఇన్స్టాగ్రామ్ ఐడీ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళితే అధికారులు అందుబాటులో లేరని వెనక్కి పంపారని ఆరోపించారు.

బాధితుల ఆరోపణలపై డెహ్రాడూన్ సిటీ ఎస్పీ శేఖర్ సుయాల్ స్పందిస్తూ.. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నామని తెలిపారు. సర్కిల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందని, ఫోన్ నంబర్‌ను పోర్టల్ ద్వారా ట్రాకింగ్‌లో పెట్టామని వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions