Ys Jagan News Latest | పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇటీవల పర్యటించిన విషయం తెల్సిందే.
ఈ పర్యటన సందర్భంగా సింగయ్య మృతి చెందడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. తాజగా ఈ కేసుకు సంబంధించి వైఎస్ జగన్ హై కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ వాహనం కింద పడే సింగయ్య మృతి చెండారని వీడియోలో స్పష్టంగా కనిపిస్తుందని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు.
దింతో జగన్ మరియు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదైంది. ఏ 1 గా కారు డ్రైవర్ రమణారెడ్డి, ఏ 2 గా జగన్ పై కేసు నమోదయ్యింది. వీరితో పాటు జగన్ వ్యక్తిగత కార్యదర్శి, నేతలు వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజినిపై కేసు నమోదయ్యింది.
ఈ నేపథ్యంలో జగన్ తో పాటు ఇతర నేతలు హై కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది.









