Vinesh Phogat Joins Politics ?| రెజ్లర్లు వినేశ్ ఫోగాట్ ( Vinesh Phogat ) ఆమె సోదరి బబితా ఫోగాట్ ( Babita Phogat ) ల మధ్య రాజకీయ పోటీ నెలకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బబితా ఫోగాట్ 2019లో బీజేపీ లో చేరి, దాద్రి ( Dadri ) స్థానం నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
మరోవైపు పారిస్ ఒలింపిక్స్ ( Paris Olympics ) లో అధిక బరువు కారణంగా ఫైనల్స్ ఆడలేకపోయిన వినేశ్ కుస్తీకి వీడ్కోలు పలికారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1న జరగనున్న హర్యానా ( Haryana )ఎన్నికల్లో వినేశ్ రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఆమె కాంగ్రెస్ ( Congress ) లో చేరి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పారిస్ నుండి స్వదేశానికి వచ్చిన సమయంలో ఎంపీ, హర్యానా కాంగ్రెస్ నాయకులు దీపేందర్ హుడా ( Deependhar Hooda ) వినేశ్ ఫోగాట్ కు స్వాగతం పలికారు. అలాగే వినేశ్ ను రాజ్యసభకు పంపాలని హుడా గతంలో వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాల మధ్య వినేశ్ కాంగ్రెస్ లో చేరే అవకాశం మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరుగుతే సోదరి బబితా ఫోగాట్ పై వినేశ్ ఫోగాట్ బరిలోకి దిగే అవకాశం ఉండనుంది.