TS Lawcet 2024 Notification | తెలంగాణ రాష్ట్రంలో న్యాయవిద్య కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్2024 (TS Lawcet 2024) నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ పీజీ లాసెట్ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి శుక్రవారం విడుదల చేసింది. మూడు మరియు ఐదేళ్ల లా కోర్సు కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) లాసెట్ పరీక్ష నిర్వహిస్తోంది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. లేట్ ఫీతో మే 25వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. జూన్ 3వ తేదీన టీఎస్ లాసెట్, టీఎస్ పీజీ లాసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 9 వేల పోస్టులతో భారీ నోటిఫికేషన్!
మూడేళ్ల లా చదవాలంటే ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఐదేళ్ల లా కోర్పు కోసం ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. పీజీ కోర్సు ఎల్ఎల్ఎంకు, ఎల్ఎల్‌బీ లేదంటే బీఎల్ చేసి ఉండాలి. మొత్తం 120 మార్కుల్లో 35 శాతం మార్కులు సాధిస్తే క్వాలీ ఫై అవుతారు.
లాసెట్ పేపర్ తెలుగుతోపాటు ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఉంటుంది. పీజీఎల్‌సెట్ ఇంగ్లీషులో మాత్రమే ఉంటుంది. ఫీజ తదితర పూర్తి వివరాలు, దరఖాస్తు ప్రక్రియ కోసం టీఎస్ లాసెట్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.