Thursday 15th October 2026
12:07:03 PM
Home > తాజా > Hyd నగరవాసులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త!

Hyd నగరవాసులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త!

  • ఆగస్టు 29 నుంచి నగరంలో ‘నైట్ బస్ సర్వీసులు’!

TGSRTC Night Bus Services తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) హైదరాబాద్ నగర ప్రయాణికులకు బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. రాత్రి వేళల్లో ప్రయాణించే వారి సౌకర్యార్థం నగరంలో ప్రత్యేకంగా ‘నైట్ బస్ సర్వీసుల’ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేవలు ఆగస్టు 29వ తేదీ నుంచి నగరంలోని ఆరు ప్రధాన మార్గాల్లో ప్రారంభం కానున్నాయి.

నైట్ బస్ సర్వీస్ వివరాలివీ..

ప్రతిరోజూ రాత్రి 10:00 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5:00 గంటల వరకు ఈ బస్సులు నడుస్తాయి. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ప్రతి 30 నిమిషాల నుంచి ఒక గంట వ్యవధిలో బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ఆరు ప్రధాన రూట్లలో తొలిదశలో ఈ సేవలను అమలు చేయనున్నారు.

హైదరాబాద్ నగరంలో రాత్రి వేళల్లో రాకపోకలు సాగించే వేలాది మందికి ఈ నిర్ణయం ఎంతో ఊరట నివ్వనుంది. రాత్రి వేళల్లో షిఫ్టులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే ఐటీ ఉద్యోగులు, ఇతర రాత్రి షిఫ్ట్ ఉద్యోగులకు సురక్షితమైన రవాణా అందుబాటులోకి రానుంది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల నుంచి ఆలస్యంగా నగరానికి చేరుకుని ఇళ్లకు వెళ్లే సాధారణ ప్రయాణికులకు కూడా ఈ సేవలు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి.

    You may also like
    HYDలో ట్రాఫిక్ గందరగోళానికి అసలు కారణం అదే: జేపీ
    మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎం!
    భాగ్యనగరంలో నకిలీ మసాలాల గుట్టురట్టు!
    whatsapp impersonation fraud
    వాట్సాప్ వెబ్‌తో కోట్లలో స్కామ్.. సీఈవోల పేరుతో అకౌంటెంట్లకు మెసేజ్!

    Leave a Reply

    Skip to toolbar

    Designed & Developed By KBK Business Solutions