Telangana Elections | తెలంగాణలో మళ్లీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో ఇటీవల ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ (MLC) స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయ్యింది.
గత నెలలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లలో అప్పటి బీఆరెస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అనంతరం వారిద్దరూ ఎమ్మెల్సీ స్థానాలకు డిసెంబర్ 9న రాజీనామా చేయడంతో ఆ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి.
ఈ స్థానాల కోసం ఎన్నికల కమిషన్ షెడ్యూలు విడుదల చేసింది. జనవరి 11 న నోటిఫికేషన్ విడుదల కానుండగా, 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ లో ఉపసంహరణకు చివరి తేదీ జనవరి 22.
జనవరి 29న ఉదయం 9 నుంచి సాయంత్రి పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం కౌంటింగ్ చేసి ఫలితాలు విడుదల చేస్తారు. ప్రస్తుతం అసెంబ్లీలో పార్టీలకు ఉన్న బలాబలాల ప్రకారం కాంగ్రెస్ కు ఒకటి, BRS ఒకటి వచ్చే అవకాశం ఉంది.