Friday 24th April 2026
12:07:03 PM
Home > క్రీడలు > చిన్నారితో ముచ్చటించిన SRH కెప్టెన్.. వీడియో వైరల్!

చిన్నారితో ముచ్చటించిన SRH కెప్టెన్.. వీడియో వైరల్!

Ishan Kishan Meets Little Fan | సన్‌రైజర్స్ హైదరాబాద్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు.

మైదానంలో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే ఇషాన్, ఒక చిన్నారి అభిమాని పట్ల చూపిన ఆత్మీయత నెటిజన్ల మనసు గెలుచుకుంది. ప్రాక్టీస్ సెషన్ ముగించుకుని వస్తుండగా జరిగిన ఈ హార్ట్ టచింగ్ సీన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘనవిజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న ఇషాన్ కిషన్, ప్రాక్టీస్ ముగించుకుని పెవిలియన్‌కు వెళ్తుండగా ఒక చిన్నారి తన ఆటోగ్రాఫ్ కోసం వేచి చూడటం గమనించారు.

వెంటనే అక్కడికి వెళ్లిన ఇషాన్, ఆ చిన్నారికి ఆటోగ్రాఫ్ ఇవ్వడమే కాకుండా, కాసేపు అతడితో ఆడుకుంటూ, నవ్విస్తూ సరదాగా గడిపారు.

ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా దూరం కావడంతో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న ఇషాన్, జట్టును సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ఆయన నాయకత్వంలో SRH ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4 గెలిచి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉంది.  

You may also like
SRH New Captian
పులి కాదు.. పాకెట్ డైనమైట్.. SRH కొత్త బాస్ అతడేనా?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions