Sunday 8th September 2024
12:07:03 PM
Home > సినిమా > అవి పాట‌లు మాత్ర‌మే కాదు… జీవిత పాఠాలు కూడా.. బాలూ ఆల‌పించిన జీవిత స‌త్యాలు..

అవి పాట‌లు మాత్ర‌మే కాదు… జీవిత పాఠాలు కూడా.. బాలూ ఆల‌పించిన జీవిత స‌త్యాలు..

ర్ధ శ‌తాబ్దం పాటు ద‌క్షిణ భార‌త సినీ సంగీతాన్ని శాసించిన సుమ‌ధుర గాత్రం మూగ‌బోయింది. ఎప్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం మ‌ర‌ణంతో భార‌తీయ సంగీతం ఒక గొప్ప గాయ‌కుడిని కోల్పోయింది.

ఎవ‌రు పోయినా.. ఎవ‌రు లేక‌పోయినా సంగీతం ఆగిపోదు.. ఘంట‌సాల పోతే.. ఎస్పీబాలు వ‌చ్చారు.. బాలు పోతే మ‌రెంద‌రో ఘంట‌సాల‌లు, బాల‌సుబ్ర‌మ‌ణ్యాలు వ‌స్తారు అంటూ గ‌తంలో ఓ పాట‌ల కార్య‌క్ర‌మంలో భాగంగా.. బాలు.. గాయ‌కుల గురించి కొన్ని మాట‌లు చెప్పారు.

కానీ, మ‌ళ్లీ ఒక బాల సుబ్ర‌మ‌ణ్యం రావాలంటే.. ఆయ‌నే పున‌ర్జ‌న్మ ఎత్తాలి. ఏ బాలూ.. ఈ బాల సుబ్ర‌మ‌ణ్యానికి సాటిరారు. ఆయ‌ణ్ని మ‌రిపించలేరు. ఇది కాద‌న‌లేని స‌త్యం.

బాల సుబ్ర‌మ‌ణ్యం స్వ‌రంలో ఉన్న మ‌హ‌త్యం ఏంటో తెలీదు కానీ, ఆయ‌న పాట ఒక వ్య‌స‌నం లాంటింది. ఆ గాత్రం వింటూ బ‌య‌టి ప్ర‌పంచాన్ని మ‌రిచిపోవ‌చ్చు. చాలామంది పాడిన పాట‌ల్లో వాటి సాహిత్యం వ‌ల్ల ఆ స్వ‌రానికి అందం వ‌స్తుంది.

కానీ బాలు ఆల‌పించిన పాట‌ల్లో సాహిత్యం మ‌న‌సులోతుల్లోకి వెళుతుంది. అంటే ఇక్క‌డ ఆ సాహిత్యం రాసిన వారిని త‌క్కువ చేయ‌డం ఉద్దేశ్యం కాదు.

మంచి సాహిత్యానికి బాలూ స్వ‌రం తోడైతే.. అది ఎప్ప‌టికీ నిలిచిపోయే పాట‌వుతుంది. అది ప్రేమ కావ్యం కావ‌చ్చు.. విర‌హ గీతం కావ‌చ్చు.. లేదా జీవితాన్ని మార్చే పాట కావచ్చు.. ప్ర‌తి మ‌న‌సునూ తాకుతుంది.

బాల సుబ్ర‌మ‌ణ్యం ఆల‌పించిన ఎన్నో పాటలు.. జీవితాన్ని తీర్చిదిద్దే పాఠాలుగా కూడా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. జీవితంలో ఓట‌మి అంచున ఉన్న‌ప్పుడు.. ఏదో కోల్పోయిన‌ప్పుడు.. నిరుత్సాహం నిలువెల్లా అలుముకున్న‌ప్పుడు.. వేటూరి.. లేదా సిరివెన్నెల అందించిన సాహిత్యంతో బాలు ఆల‌పించిన పాట‌ను ప్ర‌శాంతంగా క‌ళ్లు మూసుకొని వింటే చాలు.

ఆ స్వ‌రంలోని హాయి, మ‌హ‌త్యం మ‌ళ్లీ పున‌రుత్తేజం తీసుకొస్తాయి. అవే కాదు జీవిత స‌త్యాల‌ను చెప్పే పాట‌లు కూడా మ‌న‌సును హ‌త్తుకుంటాయి. ఇక ప్రేమ కావ్యాలు.. విర‌హ గీతాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు.

అలాంటి ఆహ్లాద‌క‌ర‌మైన జీవిత పాఠాల్లాంటి కొన్ని పాట‌లు ఇందులో పొందుప‌రిచాం.. విని ఆస్వాదించండి..

ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి
ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి
ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా
ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా
ఆశ వెంట ఆచరణుంటే
అద్భుతాలు నీ సొంతం
ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం
నిప్పులే గుండెలో నిండుతున్నా
ఉప్పొంగే జలపాతం జీవితం

లేరుగా ఈ లోకంలో మీకంటే అతి మంచోళ్ళు 
మంచిగా పైపై నటనలు చేసే వాళ్ళే పిచ్చోళ్ళు 
అరె ఆ డబ్బు పిచ్చి అధికార పిచ్చి ఓరయ్యో మనకొద్దురా 
నరజాతిని పీడించే విద్రోహ పిచ్చి విధ్వంస పిచ్చి విద్వేష పిచ్చి ఈ కోటలో రద్దురా 
పరమాత్మలు మీరేరా యారో 
నవ్వండి నవ్వండి మాక్కూడా నేర్పండి ..

రాజనీ పేదనీ మంచనీ చెడ్డనీ భేదమే యెరుగదీ యమపాశం 
ఒక్క ఐశ్వర్యము కటిక దారిద్ర్యమూ హద్దులే చేరిపెలే మరుభూమి 
మూటలలోని మూలధనం చెయ్యదు నేడు సహగమనం 
మనవెంటా తడికంటా నడిచేదీ ….

నీ మాటతో నాపై నాకే ఏదో తెలియని నమ్మకమొచ్చింది
నీ స్ఫూర్తితో ఎంతో ఎంతో సాధించాలని తపనే పెరిగింది
నీ చెలిమితో ఊహల్లోన ఊరిస్తున్న గెలుపే అందింది
ఆ గెలుపుతో నిస్పృహలోన నిదురిస్తున్న మనసే మురిసింది
ఆ మనసు అలసి పోరాదని ఈ చెలిమి నిలిచిపోవాలని
ఇలా బ్రతుకును గెలవాలని…

అవమానాలే ఆభరణాలు..
అనుమానాలే అనుకూలాలు..
సందేహాలే సందేశాలు ఛీత్కారాలే సత్కారాలు..
అనుకోవాలీ.. అడుగేయాలీ..
ముళ్ల మార్గాన్ని అన్వేషించాలి..
అలుపొస్తున్నా… కలలే కన్నా..
పూల స్వర్గాన్ని అధిరోహించాలి..
ఎవరికి వారే లోకంలో ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వేసాగాలి..

పొరపాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా…
ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా…
మనకోసమె తనలో తను రగిలే రవి తపనంతా..
కనుమూసిన తరువాతనె పెను చీకటి చెబుతుందా..
కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని..
అని తిరగేసాయా చరిత పుటలు వెను చూడక వురికే వెతలు..
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు..
ఇది కాదె విధి రాత…అనుకోదేం ఎదురీత..

నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది..
గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది..
ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా..
తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే..

ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో..
ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో..
పుడమిని చూడని కన్ను..  నడపదు ముందుకు నిన్ను..
నిరసన చూపకు నువ్వు ఏనాటికీ..
పక్కవారి గుండెలనిండా చిక్కనైన వేదన నిండ…
పక్కవారి గుండెలనిండా చిక్కనైన వేదన నిండ..
ఏ హాయి రాదోయి నీ వైపు మరువకు అది 

అసహాయతలో దడదడలాడే హృదయ మృదంగధ్వానం..
నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం..
ఎడారి బ్రతుకున నిత్యం ఛస్తూ సాగే బాధల బిడారు..
దిక్కు మొక్కు తెలియని దీనుల వ్యదార్ధ జీవన స్వరాలు..
నిలువునా నన్ను కమ్ముతున్నాయి శాంతితో నిలువనీయకున్నాయి..
ఈ తీగలు సవరించాలి ఈ అపశృతి సరిచేయాలి..
జనగీతిని వద్దనుకుంటూ నాకు నేనె పెద్దనుకుంటూ
..
కలలో జీవించను నేను కలవరింత కోరను నేను..

నిన్నటి నీడలే కనుపాపని ఆపితే.. రేపటి వైపుగా నీ చూపు సాగదుగా..
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే.. రేపటి వైపుగా నీ చూపు సాగదుగా..
చుట్టమల్లే కష్టమొస్తే కళ్లనీళ్లు పెట్టుకుంటూ కాళ్లు కడిగి స్వాగతించకూ..
ఒక్క చిన్న నవ్వు నవ్విసాగనంపకుండా లేనిపోని సేవచేయకూ..
మిణుగురులా మిలమిల మెరిసే దరహాసం చాలు కదా..
ముసురుకునే నిశి విలవిలలాడుతూ పరుగులు తియ్యదా..

అక్రమాలను కాలరాసే ఉక్కుపాదం నీదిరా..
లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా..
ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా..
కనులు గప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా..
సత్యమేవ జయతె కే నిలువెత్తు సాక్ష్యం నీవురా..
లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా
..

https://www.youtube.com/watch?v=kUtuBuSPGSI&ab_channel=BharathBathula

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions