Reliance Foundation | కొద్దిరోజుల కిందట భారత అంధ మహిళల క్రికెట్ జట్టు (Indian Blind Women Cricket Team)ప్రపంచ కప్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) చైర్ పర్సన్ నీతా అంబానీ (Nitha Ambani) భారీ నజరానా ప్రకటించారు.
ఫౌండేషన్ తరఫున భారతర అంధ మహిళల క్రికెట్ జట్టుకు రూ. 5 కోట్ల ప్రోత్సాహకాన్ని అంజదేశారు. ముంబైలో నిర్వహించిన యునైటెడ్ ఇన్ ట్రయింఫ్ (United in Triumph) అనే ప్రత్యేక కార్యక్రమంలో నీతా అంబానీ స్వయంగా రూ. 5 కోట్ల చెక్కును జట్టుకు అంద జేశారు.
ఈ సందర్భంగా ప్రపంచకప్ లో జట్టు కనబరిచిన అద్భుతమైన ప్రదన్శను, స్పూర్తిని ప్రశంసించారు. అంధ మహిళల జట్టు కెప్టెన్ దీపికతో పాటు, 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన పురుషుల జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohith Sharma), 2025 ప్రపంచ్ కప్ గెలిచిన భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harman Preet Kaur)లను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్, ఐసీసీ ఛైర్మన్ జై షాతో పాటు పలువురు సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు.









