Pm Modi’s Visit To CJI Chandrachud’s Residence | భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ( Justice Dy Chandrachud )నివాసంలో జరిగిన గణపతి పూజకు ప్రధాని నరేంద్రమోదీ ( PM Modi ) బుధవారం హాజరయ్యారు.
దింతో సీజేఐ ( CJI ) ఇంట్లో ప్రధాని పూజకు హాజరవ్వడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి.
తిరుగుబాటు శివసేన ( Shivasena ), ఎన్సీపీ ( NCP ) ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లకు సంబంధించిన కేసుల విచారణ నుండి చీఫ్ జస్టిస్ తప్పుకోవాలని శివసేన యూబీటీ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ( Sanjay Rout )డిమాండ్ చేశారు.
రాజ్యాంగాన్ని రక్షించే వ్యక్తులను రాజకీయ నాయకులు కలవడం ప్రజల్లో అనుమానాలను రేకెత్తిస్తోందని చెప్పారు. తమ కేసులు సీజేఐ వద్దకు వెళ్తే న్యాయం జరుగుతుందో లేదో అనే అనుమానాలు వస్తున్నాయన్నారు.
సీజేఐ నివాసంలో ప్రధాని పూజలు చేయడాన్ని సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ( Kapil Sibal )తప్పుబట్టారు.
అయితే సీజేఐని ప్రధాని కలిస్తే తప్పేంటి అని బీజేపీ ప్రతిపక్షాలను ప్రశ్నించింది.