Pawan Kalyan’s son fire injury News | సింగపూర్ దేశంలో ఓ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం తెల్సిందే.
ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న బాలుడు కొలుకుంటున్నాడు. మార్క్ శంకర్ ను జనరల్ వార్డుకు షిఫ్ట్ చేసి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి.
అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి పవన్ కళ్యాణ్ సింగపూర్ లోని ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం వైద్యులతో మాట్లాడారు. ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడంతో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, పలు వైద్య పరీక్షలు చేయాలని పవన్ కు వైద్యులు చెప్పారు. పవన్ తో పాటు ఆయన సతీమణి అన్నా లెజ్నోవా దగ్గరుండి బాబును చూసుకుంటున్నారు.