Pawan Kalyan Assets | ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మరియు జనసేన నేత నాగబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తన సంపాదన, అప్పుల వివరాలను అఫిడవిట్ లో పేర్కొన్నారు పవన్. గడిచిన ఐదేళ్లలో తన సంపాదన రూ.114 కోట్ల 76 లక్షలుగా పేర్కొన్నారు.
సంపాదనకు సంబంధించి ఆదాయ పన్నుగా రూ.47 కోట్ల 7 లక్షలు, జిఎస్టీ రూపంలో రూ.28 కోట్ల 84 లక్షలు చెల్లించినట్లు అఫిడవిట్ లో పొందుపరిచారు.
అలాగే వివిధ బ్యాంక్ ల నుండి మరియు వ్యక్తుల నుండి కలిపి రూ.64 కోట్ల 26 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రూ.20 కోట్లకు పైగా పవన్ కళ్యాణ్ విరాళాలు ఇచ్చారు.
ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకలాపాలకు, పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాలకు రూ.17 కోట్ల 15 లక్షలు విరాళం అందించారు పవన్. వివిధ సంస్థలకు మరో రూ.3 కోట్ల 32 లక్షలు విరాళంగా ఇచ్చారు పవన్ కళ్యాణ్.