Rajasingh Warns CM Jagan | తెలంగాణ బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) మంగళవారం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇష్టారాజ్యంగా ఆలయాలు, మండపాల కూల్చివేతకు పాల్పడితే దేశంలోని హిందువులంతా జగన్ (AP CM YS Jagan) కాలర్ పట్టుకుంటారని హెచ్చరించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ఒక మండపాన్ని టీటీడీ ఇటీవల కూల్చివేసినట్లు వార్తలు వచ్చాయి.
ఈ సంఘటన పైన స్పందించిన గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పై ధ్వజమెత్తారు.
తిరుమల దేవస్థానం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంతమాత్రన అది వారి సొంతం కాదనీ, దేశంలోని హిందువులందరి సొంతమని రాజాసింగ్ స్పష్టం చేశారు.
శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి మండపాన్ని కూల్చే అధికారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, టీటీడీకి ఎవరిచ్చారని రాజాసింగ్ ప్రశ్నించారు.
అక్కడి అధికారులతో మాట్లాడితే మండపం ప్రమాదకరంగా మారినందుకు కూల్చివేసినట్లు చెబుతున్నారు. అలాంటి మండపాన్ని పటిష్టం చేసే అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు కూల్చివేసిందని నిలదీశారు రాజాసింగ్.
Read Also: పాకిస్తాన్, ఇండియా ఒక పబ్జీ ప్రేమకథ…ప్రియుడి కోసం పాకిస్తాన్ నుండి ఇండియా వచ్చిన యువతి…!
“ఆంధ్రప్రదేశ్ లో పురాతన మండపాలు, ఆలయాలు చాలా ఉంటాయి మరి అన్నింటిని కూల్చివేస్తారా? అయినా వాటిని కూల్చే అధికారం మీకు ఎవరిచ్చారు?
ఆలయాలు, మండపాల కూల్చివేత అనేది చాలా సున్నితమైన అంశం. వాటిని కూల్చివేతకు పాల్పడే ముందు పండితుల, నిపుణుల సలహాలు తీసుకోవాలి” అని రాజాసింగ్ హితవుపలికారు.
మండపాన్ని కూల్చివేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ కోరారు.
ఈ విధంగా ఇష్టంవచ్చినట్లు మండపాలని, ఆలయాలను కూల్చివేస్తే దేశంలోని హిందువులంతా వైస్ జగన్మోహన్ రెడ్డి కాలర్ పట్టుకుంటారని” రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు(Rajasingh Warns CM Jagan).
మరోవైపు, మండప నిర్మాణాన్ని కూల్చివేయడాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఖండించింది. అత్యంత శిథిలావస్థలో ఉన్న పార్వేటు మండపం వరకు పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు పేర్కొంది.
పాపవినాశనానికి వెళ్లే దారిలో ఉన్న మండపం పూర్తిగా ఆలయానికి సంబంధించిన మతపరమైన కార్యక్రమాలకు, వార్షిక కార్తీక వనభోజన కార్యక్రమాలకు వినియోగిస్తుందని స్పష్టం చేసింది.