Minister Komatireddy Venkat Reddy | అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప 2 (Pushpa2) చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. విడుదలకు ముందు రోజు బుధవారం బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి.
అయితే, హైదరాబాద్ సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో బెనిఫిట్ షోలపై సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోకు అనుమతులు ఇవ్వబోమని తెలిపారు.
నగరంలో బెనిఫిట్ షోలు వేయడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని కోమటిరెడ్డి అన్నారు. కుటుంబంతో కలిసి సరదాగా సినిమా చూసేందుకు వచ్చినవారు తమ కుటుంబ సభ్యురాలిని కోల్పోవడం తనను ఎంతో బాధించిందని మంత్రి తెలిపారు.