Sunday 14th June 2026
12:07:03 PM
Home > తాజా > ఆసుపత్రిలో కేసీఆర్.. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ!

ఆసుపత్రిలో కేసీఆర్.. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ!

Akbaruddin Owaisi

Akbaruddin Owaisi As Pro-tem Speaker | తెలంగాణ శాసనసభ సమావేశాలు శనివారం నుండి మొదలుకానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే ల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ నేపథ్యంలో చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ని ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా ఎక్కువసార్లు ఎన్నికైన ఎమ్మెల్యే ను ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకుంటారు. ఈ లెక్కన ఎనిమిది సార్లు ఎన్నికైన మాజీ సీఎం కేసీఆర్ ను ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకోవాలి. కానీ కేసీఆర్ కాలికి గాయం కావడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

దీంతో ఆయన తర్వాత ఎక్కువ సార్లు ఎన్నికైన ఎమ్మెల్యే ను ప్రొటెంస్పీకర్ గా నియమించనున్నారు. అందులో భాగంగా ఆరుసార్లు ఎమ్మెల్యే గా ఎన్నికైన అక్బరుద్దీన్ ఓవైసీ ని ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేశారు. శనివారం ఉదయం 8.30 నిమిషాలకు ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ తో రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు గవర్నర్.

You may also like
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
kcr revanth
కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్!
kcr revanth
ఇదేక్కడి జాతిపిత లక్షణం.. కేసీఆర్ పై సీఎం రేవంత్ విమర్శలు!
kalvakuntla kavitha
‘నా భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారు’.. సిట్ పిలిస్తే సహకరిస్తా: కవిత

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions