Sunday 11th May 2025
12:07:03 PM
Home > తాజా > మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!|

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!|

Minister Komatireddy Venkatreddy| రోడ్లు మరియు భవనాల ( R & B ) శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు నల్గొండ ( Nalgonda ) ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Komatireddy Venkatreddy ).

ఈ మేరకు ఆదివారం నాడు సచివాలయంలోని ఆయన ఛాంబర్ ( Chamber ) లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత శాఖకు సంబంధించిన 9 ఫైల్స్ ( Files ) పై సంతకం చేశారు.

అనంతరం మీడియా ( Media )తో మాట్లాడుతూ..10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) అధికారంలోకి రావడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోడ్ల పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని వెల్లడించారు.

ఇందులో భాగంగా హైదరాబాద్ – విజయవాడ ( Hyderabad-vijayawada ) హైవే ( Highway ) కు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. గత 10 ఏళ్ల బీఆరెస్ ( Brs ) పాలనలో రహదారులపై శ్రద్ధ వహించలేదని ఆరోపించారు.

అలాగే ప్రభుత్వం ఏర్పాటైన రెండు రోజుల్లోనే ఎం చేసారని హరీష్ రావు ( Harish Rao ) విమర్శించడం ఏంటని మండిపడ్డారు. మీ పాలనలో ఏమి చేసారని ప్రశ్నించారు కోమటిరెడ్డి.

You may also like
మృణాల్ ఠాకూర్ తో పెళ్లి..స్పందించిన నటుడు
‘ఆడవారి సింధూరాన్ని తుడిచారు..అందుకే’
‘మురళీనాయక్ లాంటి వీరులను కన్న తల్లులకు మదర్స్ డే అంకితం’
‘ఆపరేషన్ సింధూర్’ కొనసాగుతుంది..IAF కీలక ప్రకటన

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions