Sunday 8th September 2024
12:07:03 PM
Home > తెలంగాణ > వరకట్నం తీసుకుంటున్నారా.. అయితే మీ డిగ్రీపై ఆశలు వదులుకోవాల్సిందే!

వరకట్నం తీసుకుంటున్నారా.. అయితే మీ డిగ్రీపై ఆశలు వదులుకోవాల్సిందే!

Dowry
  • కేరళ రూల్ ని అమలు చేసేందుకు తెలంగాణ సర్కార్ కసరత్తు
  • ఇప్పటికే ఈ కేరళ వరకట్న రూల్ పై అధ్యయనం

Kerala Anti Dowry System | మహిళలూ, పురుషులూ అన్నింటిలోనూ సమానమే అని నినదించే ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో కూడా ఆడపిల్ల కుంటుబాలను వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి వరకట్నం (Dowry).

ఈ వరకట్న దాహానికి పేదింటి బిడ్డలతోపాటు, పెద్దింటి యువతులూ బలవుతున్నారు. అదనపు కట్నం పేరుతో వస్తున్న వేధింపులు భరించలేక ఈ కాలంలో కూడా చాలా మంది నూతన వధువులూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.  

వరకట్న నిషేధం చట్టం ఉన్నా అది అమల్లో అంతంత మాత్రమే. ఒకవేళ ఎక్కడో ఓ చోట చర్యలు తీసుకున్నా మళ్లీ పునరావృతం అవుతూనే ఉన్నాయి.

కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన ‘ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా-2022’ (Men and Women in India 2022) సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం గృహహింస కేసుల్లో తెలంగాణ 50.4 శాతంతో రెండో స్థానంలో ఉంది.

75 శాతం కేసులతో అసోం (Assom) అగ్రస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. గృహ హింస కేసుల్లో ఢిల్లీ (Delhi) 48.9 శాతంతో మూడో స్థానంలో ఉంది.

చాలా వరకు గృహహింస (Domestic Violence) కేసులు వరకట్న వేధింపులతో ముడిపడి ఉండడం ఆందోళనకరం. ఈ సమస్యను పరిష్కరించడానికి, ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మరియు మహిళలపై నేరాలు, ముఖ్యంగా వరకట్నంపై అవగాహన పెంచాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.

ఈ నేపథ్యంలో గృహ హింస కేసులకు ప్రధాన కారణమవుతున్న వరకట్న వేధింపులను నిలువరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కేరళలోని వరకట్న వ్యతిరేక విధానాన్ని తెలంగాణలో కూడా అనుసరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణలోనూ అదే రూల్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి!

Read Also: మందుబాబులకు కిక్కెక్కించే వార్త.. ఆఫీస్ లోనే బీర్ లాగించేయొచ్చట!

ఇంతకీ ఆ రూల్ ఎంటంటే..

కేరళలో (Kerala) వరకట్నాన్ని నిర్మూలించేందుకు అక్కడి ప్రభుత్వం ఒక రూల్ విధించింది. “నేను కట్నం తీసుకోను, ఇవ్వను లేదా ప్రోత్సహించను” అని హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే విద్యార్థులను (Stedents) కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో చేర్చుకుంటారు.

ఇలా చెప్పడం ద్వారా, విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆమోదంతో స్వీయ-అంగీకార పత్రంపై సంతకం చేయాలి. అప్పుడే యూనివర్సిటీల్లో ప్రవేశం లభిస్తుంది.

భవిష్యత్తులో, వారు కట్నం అడిగినా లేదా వేధించినా, వారు పోలీసులకు మరియు సంబంధిత విశ్వవిద్యాలయాలకు ఫిర్యాదు చేయవచ్చు.

ఆరోపణలు నిజమో కాదో విశ్వవిద్యాలయం విచారణ జరుపుతుంది. ఒకవేళ అవి నిజమని తేలితే వారి డిగ్రీని శాశ్వతంగా రద్దు చేస్తుంది.

రెండేళ్ల క్రితం కేరళ యూనివర్శిటీలకు ఛాన్స్ లర్‌గా వ్యవహరిస్తున్న గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ (Mohammod Arif Khan) తీసుకున్న సంచలన నిర్ణయం ఇది.

Also Read: తిరుమలకు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే మీకో శుభవార్త!

ఇప్పుడు కేరళతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా కలిసొచ్చే అంశంగా మారింది. భారతదేశంలో పెరుగుతున్న వరకట్న వేధింపులు, గృహ హింస కేసులను పరిష్కరించడం ఈ నిర్ణయం లక్ష్యం.

తాజాగా ఇదే రూల్ ని తెలంగాణలోనూ వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సీనియర్ లెక్చరర్ శ్రీనివాస్ మాధవ్ కేరళ వరకట్న వ్యతిరేక విధానాన్ని అధ్యయనం చేశారు.

రెండేళ్ల కిందటే కేరళలో వరకట్న వ్యతిరేక విధానం అమలులోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థులు, తల్లిదండ్రుల వైఖరిలో మార్పు వచ్చింది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ఇదే విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్‌కు ప్రతిపాదన సమర్పించారు.

ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదనను మరియు అవసరమైన ప్రోటోకాల్‌లను పరిశీలిస్తోంది. ఈ విషయమై ఉన్నత విద్యామండలితో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖతో సమావేశం నిర్వహించి అధికారికంగా ప్రకటించాలని కూడా అధికారులు ఆలోచిస్తున్నారు.

సో.. మగ పురుషులూ.. కాస్త కట్నం విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మీరు చదివిన చదువంతా వేస్టయిపోతుంది. బీ కేర్ ఫుల్!

You may also like
shabarimala
శబరిమలకు 31 లక్షల మంది భక్తులు.. ఆదాయం ఎంతంటే!
Corona cases are increasing again in India
ఇండియాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
A girl collapsed in the queue line at Sabarimala temple.
శబరిమల ఆలయం వద్ద క్యూ లైన్‌లో కుప్పకూలిన బాలిక.చికిత్స పొందుతూ మృతి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions