Tuesday 16th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > జాయినింగ్ ద జీబ్లీ ట్రెండ్.. జీబ్లీ ఇమేజెస్ వైరల్!

జాయినింగ్ ద జీబ్లీ ట్రెండ్.. జీబ్లీ ఇమేజెస్ వైరల్!

ghibli

Joining The Ghibli | ప్రస్తుత ఆర్టీఫీషియల్ ఇంటలీజెన్స్ (AI) యుగంలో రోజుకో కొత్త ఫీచర్ పుట్టుకొస్తోంది. తాజాగా ఓపెన్ ఏఐ (Open AI) చాట్ బాట్ మరో కొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. చాట్ జీపీటీ 4ఓ ఫీచర్ ద్వారా మన ఫొటోలను జీబ్లీ యానిమేషన్ చిత్రాలుగా రూపొందించుకోవచ్చు.

జీబ్లీ అనేది ఫేమస్ జపనీస్ యానిమేషన్ స్టూడియో. దీని ద్వారా మన చిత్రాలను మనకు నచ్చిన విధంగా చేతితో గీసిన ఫొటోల మాదిరిగా మార్చుకోవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జాయినింగ్ ద జీబ్లీ ట్రెండ్ నడుస్తోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరి జీబ్లీ ఇమేజ్ లను షేర్ చేస్తున్నారు.

కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా ప్రధాని మోడీతో తీసుకున్న ఫొటోను జీబ్లీ ఇమేజ్ గా మార్చి షేర్ చేశారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు కూడా జీబ్లీ ట్రెండ్ లో చేరిపోయారు. ‘జీబ్లీ ట్రెండ్ లో చేరుతున్నాను.. ఇదిగో నా ఎంట్రీ’ అంటూ ప్రధాని మోడీ, జనసేన చీఫ్ పవన్ కలిసి దిగిన ఫొటోను, కుటుంబ సభ్యుల ఫొటోలను జీబ్లీ ఇమేజ్ లుగా మార్చి షేర్ చేశారు.

స్టూడియో జీబ్లీ అనేది ఒక ప్రఖ్యాత జపాన్ యానిమేషన్ స్టూడియో. 1985లో హయావో మియాజాకీ, ఇసావో తకాహటా, తోషియో సుజుకీ అనే ముగ్గురు స్థాపించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions