Tuesday 8th September 2026
12:07:03 PM
Home > తాజా > ఈ 37 రోజుల్లో..ఎమోషనల్ అయిన జానీ మాస్టర్

ఈ 37 రోజుల్లో..ఎమోషనల్ అయిన జానీ మాస్టర్

Jani Master With Family | అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ ( Assistant Lady Choreographer ) ఫిర్యాదుతో అరెస్ట్ అయి చెంచల్ గూడ జైలులో ఉన్న జానీ మాస్టర్ శుక్రవారం బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ నేపథ్యంలో కుటుంబాన్ని తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు.

గత 37 రోజుల్లో ఫ్యామిలీని ఎంతో మిస్ అయినట్లు సోషల్ మీడియా ( Social Media )లో పోస్ట్ చేశారు. కుటుంబ, సన్నిహితుల ప్రార్ధనల మూలంగానే తాను ఈరోజు ఇక్కడ ఉన్నట్లు పేర్కొన్నారు. నిజం అనేది ఏదొక రోజు కచ్చితంగా బయటకు వస్తుందని ధీమా వ్యక్తంచేశారు.

కానీ, తన కుటుంబం ఇన్ని రోజులు పడిన బాధ తనను ఎల్లకాలం వేదిస్తుందని ఆవేదన చెందారు. యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై పొక్సో చట్టం కింద కేసును నమోదు చేసిన పోలీసులు, గత నెల 19న గోవా ( Goa )లో జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు.

పొక్సో చట్టం కింద కేసు నమోదవడంతో జానీకి ప్రకటించిన జాతీయ అవార్డును నిలిపివేస్తున్నట్లు అవార్డుల కమిటీ ప్రకటించిన విషయం తెల్సిందే.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions