Thursday 7th August 2025
12:07:03 PM
Home > తాజా > రేణు దేశాయ్ కు సాయం చేసిన ఉపాసన కొణిదెల..ఏ విషయంలో అంటే !

రేణు దేశాయ్ కు సాయం చేసిన ఉపాసన కొణిదెల..ఏ విషయంలో అంటే !

Upasana Konidela Helps Renu Desai | నటి రేణు దేశాయ్ కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ( Global Star Ram Charan ) సతీమణి ఉపాసన తన వంతు సహాయం అందించారు. రేణు దేశాయ్ కు ముగజీవులు అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో కూతురు ఆధ్య పేరిట ఓ ఎన్జీఓ ( NGO )ను స్థాపించారు.

మూగజీవాల సంరక్షణ కోసం ‘ ఆద్య యానిమల్ షెల్టర్ ‘ ( Aadhya Animal Shelter )అనే పేరుతో సంస్థను స్థాపించారు. ఈ సంస్థకు ఎవరైనా విరాళాలు ఇవ్వొచ్చని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఓ అంబులెన్స్ కొనుగోలు చేసేందుకు ఉపాసన సహాయం చేశారు.

రాం చరణ్ పెంపుడు శునకం రైమీ పేరుతో ఈ విరాళం అందించారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ పరోక్షంగా చెప్పారు. నూతన అంబులెన్స్ ను కొనుగోలు చేసేందుకు సహాయం చేసిన రైమీ కి ధన్యవాదాలు అని తెలిపారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఉపాసన కొణిదెల ( Upasana Konidela ) ను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. ఉపాసన మంచి మనసును అందరూ మెచ్చుకుంటున్నారు.

You may also like
‘బీసీలకు 42% రిజర్వేషన్లు..తెలంగాణ తడాఖా చూపిస్తాం’
‘నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు’
ధనుష్-మృణాల్ డేటింగ్ లో ఉన్నారా?
లార్డ్స్ మైదానంలో ‘నక్క పరుగులు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions