Monday 17th August 2026
12:07:03 PM
Home > క్రీడలు > ‘ట్రావిస్ హెడ్ యాడ్..ఊబర్ పై ఆర్సీబీ దావా’

‘ట్రావిస్ హెడ్ యాడ్..ఊబర్ పై ఆర్సీబీ దావా’

IPL franchise RCB sues Uber for alleged trademark misuse | బైక్ ట్యాక్సీ సేవల్ని అందించే ప్రముఖ ఊబర్ ఇండియా సంస్థపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం ఢిల్లీ కోర్టులో దావా వేసింది. ఇటీవల ఊబర్ ‘బ్యాడీస్ ఇన్ బెంగళూరు’ అనే పేరుతో ఒక యాడ్ ను రిలీజ్ చేసింది.

ఇందులో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ నటించారు. యాడ్ లో హెడ్ బెంగుళూరు చిన్నస్వామి స్టేడియానికి వెళ్లి ‘బెంగళూరు vs హైదరాబాద్’ బోర్డు పై రాయల్లీ చాలెంజ్డ్ బెంగళూరు అని స్ప్రే చేస్తాడు. అయితే ఇలా చేయడం ఆర్సీబీ ట్రేడ్ మార్క్ ను అనధికారికంగా ఉపయోగించడమే కాకుండా వక్రీకరించారని ఆర్సీబీ యాజమాన్యం పిటిషన్ లో పేర్కొంది.

ఆర్సీబీ బ్రాండ్ ను ఎగతాళి చేసే విధంగా, ట్రేడ్ మార్క్ ను దుర్వినియోగం చేసే విధంగా ఉందని ఆర్సీబీ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. యాడ్ ద్వారా ఆర్సీబీ బ్రాండ్ ను ఉద్దేశ్యపూర్వకంగా కించపరచడమే అని పేర్కొన్నారు. మరోవైపు తమకు కించపరిచే ఉద్దేశ్యం లేదని, కేవలం హాస్యం కోసమే ఇలా చేసినట్లు ఊబర్ తరఫు న్యాయవాదులు తెలిపారు.

బెంగళూరు ట్రాఫిక్‌లో ఊబర్ యొక్క వేగవంతమైన సేవలను హైలైట్ చేయడం మాత్రమే తమ ఉద్దేశ్యమన్నారు. ఈ నేపథ్యంలో యాడ్ పై నిషేధం విధించాలని ఆర్సీబీ న్యాయవాదులు స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ సౌరభ్ బెనర్జీ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions