New Traffic Rule For Techies In B’luru | ఆఫీస్ లకు వెళ్లే క్రమంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించే సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు చెక్ పెట్టే లక్ష్యంతో బెంగుళురు ట్రాఫిక్ ఈస్ట్ డివిజన్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి, టెక్కీలు పట్టుబడితే పోలీసులు మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా నేరుగా వాళ్ల కంపెనీలకు తెలియజేస్తారు. ఉల్లంఘించిన వ్యక్తిని పట్టుకున్నప్పుడు వారి కంపెనీ ఐడీ కార్డును ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేసి, ఆ టెక్ కంపెనీలతో సంప్రదించి వారికి పంపుతారు.
రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించడానికి ఈ వారం ఔటర్ రింగ్ రోడ్, వైట్‌ఫీల్డ్ ను కవర్ చేసే నగరంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కారిడార్‌లో పైలట్ ప్రాతిపదికన ప్రత్యేకమైన డ్రైవ్‌ను ప్రారంభించింది.
ఈ డ్రైవ్ ద్వారా ఉల్లంఘనలు తగ్గితే, బెంగళూరులోని ఇతర ప్రధాన ప్రాంతాలకు కూడా దీనిని విస్తరిస్తామని పోలీసులు తెలిపారు.