Have 4 Children And Get Rs.1 Lakh | నలుగురు పిల్లల్ని కనండి రూ. లక్ష రివార్డును పొందండి అంటూ పరుశురాం కళ్యాణ్ బోర్డు ( Parshuram Kalyan Board ) అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
మధ్యప్రదేశ్ ( Madhya Pradesh ) ప్రభుత్వ ఆధ్వర్యంలో పరుశురాం కళ్యాణ్ బోర్డు నడుస్తుంది. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర రాజధాని భోపాల్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో బోర్డు అధ్యక్షుడు పండిత్ విష్ణు రాజోరియా ( Pandit Vishnu Rajoria ) కీలక వ్యాఖ్యలు చేశారు.
బ్రాహ్మణ దంపతులు ఎవరైతే నలుగురు పిల్లల్ని కంటారో వారికి రూ.లక్ష అవార్డుగా ఇస్తామని ప్రకటన చేశారు. ఈ మధ్య దంపతులు ఒక బిడ్డను కని ఆగిపోతున్నారు, కానీ ఇది భవిష్యత్ లో పెద్ద సమస్యగా మారుతుందని పేర్కొన్నారు.
కుటుంబాల పై దృష్టి పెట్టాలని, భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని కనీసం నలుగురు పిల్లల్ని కనాలని సూచించారు. నలుగురు పిల్లల్ని కనే మహిళలకు బోర్డు తరఫున రూ.లక్ష ఇస్తామని, తాను అధ్యక్షుదిగారు దిగిపోయినా కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని పిలుపునిచ్చారు.