Fire in Falaknuma Express Train | పశ్చిమ బెంగాల్ హౌరా నుండి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ (Falaknuma Express Train) రైలులో ఈరోజు ఉదయం 11 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
యాదాద్రి జిల్లా బొమ్మాయిపల్లి-పగిడిపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. రైలులో S4 బోగీలో మొదట మంటలు చెలరేగాయి.
తర్వాత S3, S5, S6 భోగీలకు వ్యాప్తించాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగి రైలులో నుండి దిగిపోయారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
S3, S4, S5, S6 బోగీలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఘటన ఉదయం జరగడం వలన ప్రాణ నష్టం తప్పింది.
కాలిపోయిన బోగీల్లో ఎక్కువగా విశాఖ, విజయనగరం వాసులు ఉన్నట్లు సమాచారం.
మంటలు చెలరేగిన భోగిలను ట్రైన్ సిబ్బంది రైలు నుండి విడదీయడం వలన ఇతర భోగిలకు మంటలు వ్యాపించకుండా అరికట్ట కలిగారు. మిగిలిన భోగిలతో రైలు సికింద్రాబాద్ బయలుదేరింది.
మంటలు చెలరేగడానికి కారణం ఎంటనేది తెలియాల్సి ఉంది. రైలు, ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.