Thursday 1st May 2025
12:07:03 PM
Home > తాజా > రాజాసింగ్ తో ఈటల భేటీ..హరీష్ రావుతో భేటీ అయిన కొద్దీ రోజులకే..!

రాజాసింగ్ తో ఈటల భేటీ..హరీష్ రావుతో భేటీ అయిన కొద్దీ రోజులకే..!

Rajendhar Met With Raja Singh

బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ భేటీ అయ్యారు.

గోషామహల్ లోని రాజాసింగ్ ఇంటికి వెళ్లి ఈటల రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఇటీవల రాజాసింగ్ హరీష్ రావుతో ఆయన స్వగృహంలో భేటీ అయ్యారు. నియోజకవర్గ సమస్యలపై మాత్రమే చర్చింనట్లు రాజాసింగ్ పేర్కొన్నారు.

కానీ రాజాసింగ్ త్వరలో పార్టీ మారబోతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఇటువంటి తరుణంలో ఈటల రాజేందర్, రాజాసింగ్ తో భేటీ అవ్వడం ఆసక్తిగా మారింది.

గోషామహల్ నియోజకవర్గoలో బీజేపీ కార్పొరేటర్లను, కార్యకర్తలను పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని రాజేందర్ మీడియాకు తెలిపారు.

ముస్లిం ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ అధిష్టానం రాజాసింగ్ ను సస్పెండ్ చేశారు. తనపై విధించిన సస్పెన్షన్ గురుంచి రాజాసింగ్, ఈటల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

అతి త్వరలో రాజాసింగ్ పై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేసే విధంగా అధిష్టానాన్ని కోరుతానని ఈటల హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది

You may also like
kangana ranaut
ఇంటి కరెంట్ బిల్ చూసి షాకైన నటి!
Mandipattu-Kishan Reddy on the government saying that it has written down the tradition of the legislative assembly
బీజేపీపై విషం కక్కడమే వాళ్ల ఎజెండా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్.. నోటీసులు ఇచ్చిన అసెంబ్లీ కార్యదర్శి!
maharashtra new cm
మహారాష్ట్ర రాజకీయాల్లో సస్పెన్స్ కు తెర.. నెక్స్ట్ సీఎం ఎవరంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions