Tuesday 16th June 2026
12:07:03 PM
Home > తాజా > కాంగ్రెస్ ఖమ్మం సభకు భారీ ఏర్పాట్లు.. కీలక హమీలు ఇవ్వనున్న రాహుల్?

కాంగ్రెస్ ఖమ్మం సభకు భారీ ఏర్పాట్లు.. కీలక హమీలు ఇవ్వనున్న రాహుల్?

congress party

Congress Meeting In Khammam | తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల నగారా మోగించడానికి సిద్ధం అవుతోంది.

ఖమ్మం వేదికగా జూలై 2న భారీ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

ఖమ్మం సభకు జనగర్జన అనే నామకరణం చేశారు. 5 లక్షల మంది జనసమీకణే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

ఈ సభలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తన అనుచరులతో  కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నారు.

ఆయనతోపాటు రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన పలువురు కీలక నేతలు హస్తం గూటికి చేరనున్నారు.

Read Also: సీఎం రాజీనామా.. మణిపూర్ లో నాటకీయ పరిణామాలు!

భట్టి పాదయాత్ర ముగింపు..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పీపుల్స్ మార్చ్ యాత్ర ఖమ్మం సభతో ముగుస్తుంది.

ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్ వద్ద దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈరోజు (శుక్రవారం) తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్న భట్టి విక్రమార్కను కలిశారు. వీరిద్దరూ ఖమ్మంలో నిర్వహించ బోయే సభ గురిచి చర్చించారు.

తర్వాత మీడియా తో మాట్లాడిన వీరు ఈ సభ ద్వారా తెలంగాణ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారుతాయని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.

ఖమ్మం సభలో రాహుల్ గాంధీ ఇచ్చే సందేశంతో తెలంగాణ దశ-దిశా మారనున్నదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ సభ ద్వారా బీఆరెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లో ఎండగడుతాం అని భట్టి వ్యాఖ్యానించారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే రైతు రుణమాఫీ, స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు, ఉచిత సిలిండర్లు ఇలా పథకాలతో ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత జోష్ పెంచిన తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు ఖమ్మం సభ ద్వారా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు పోతుంది.

You may also like
కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనమా..? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్!
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
revanth reddy
‘హైదరాబాద్ చెరువులకు ప్రాణ ప్రతిష్ట చేస్తున్నాం’
kcr revanth
ఇదేక్కడి జాతిపిత లక్షణం.. కేసీఆర్ పై సీఎం రేవంత్ విమర్శలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions