Friday 18th September 2026
12:07:03 PM
Home > తాజా > మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి..కొత్త ప్రభుత్వంలో తొలి ఉద్యోగం ఆమెకే!

మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి..కొత్త ప్రభుత్వంలో తొలి ఉద్యోగం ఆమెకే!

rajini

CM Revanth Signs On Rajini File | తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తొలుత కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాల ఫైల్ పై సంతకం చేశారు సీఎం.

అనంతరం గతంలో మాట ఇచ్చినట్లుగా నాంపల్లి కి చెందిన దివ్యాoగురాలు రజీనికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రం పై సంతకం చేసి స్వయంగా ఆమెకు అందజేశారు.

కాగా గత ఆక్టోబర్ లో టిపిసిసి చీఫ్ రేవంత్ ను కలిసిన దివ్యాoగురాలు రజిని పిజి పూర్తి చేసిన తనకు అటు ప్రైవేట్ ఇటు ప్రభుత్వo లో ఉద్యోగం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆమె వినతి విన్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో గురువారం నాడు సిఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ అనంతరం అక్కడే రజినికి ప్రభుత్వ ఉద్యోగ ఫైల్ పై సంతకం చేశారు.

You may also like
ఆయన వన్ టైం వండర్.. సీఎం రేవంత్ పై సంజయ్ బారు కీలక వ్యాఖ్యలు!
తెలంగాణలో వారికి కూడా పెన్షన్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి: సీఎం రేవంత్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions