KCR Speech | బీఆరెస్ అధినేత కేసీఆర్ (KCR), టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై పదునైన మాటలతో దాడి చేశారు.
ఈ మేరకు అశ్వారావుపేట నియోజకవర్గంలో బీఆరెస్ ప్రజా ఆశీర్వాదా సభలో మాట్లాడుతూ విమర్శలు ఎక్కుపెట్టారు.
“ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు అహంకారంతో మాట్లాడుతున్నారు. ఒకటి, రెండు, మూడు సార్లు ఘంటాపథంగా రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతుందంటున్నడు.
అవసరమైతే 10 హెచ్పి మోటార్లు పెట్టుకోవాలని అంటున్నడు. అస్సలు ఆయన అహంకారం ఏందో అర్థం కావడం లేదు.
ఆయన ఏం పడగొడుతడో.. ఏం చేస్తడో నాకు తెల్వది కానీ.. ఆయనకు ఉన్న అవగాహన ఏంటో నాకు తెల్వదు. ఆయనకు అసలు తెలివి ఏంటో తెలియదు.
కాంగ్రెస్ అధికారం లోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో పాటు ఏకంగా రాహుల్ గాంధీ కూడా అంటున్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కేసీఆర్ రైతు బంధు ఇస్తూ ప్రభుత్వ డబ్బును దుబారా చేస్తున్నారని అంటున్నారు’ అని కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు బీఆరెస్ అధినేత. 24 గంటల కరెంట్ కావాలంటే మళ్ళీ బీఆరెస్ ను గెలిపించాలని కోరారు ఆయన.