Cm Chandrababu ON Operation Budameru | త్వరలోనే ఆపరేషన్ బుడమేరు ( Operation Budameru ) ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ( Cm Chandrababu ) ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం బుడమేరుకు గండ్లు పడిన ఇబ్రహీంపట్నం శాంతినగర్, కవులూరు ప్రాంతాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన..బుడమేరు స్థలాలను కబ్జా చేసి, అక్రమ నిర్మాణాలు నిర్మించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఆపరేషన్ బుడమేరు మొదలుపెట్టి వాటిని తొలగించనున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.
రాజకీయ ముసుగు వేసుకున్న నేరస్తులను వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్ ( Warning )ఇచ్చారు. మట్టి దోపిడీ చేసి, అడ్డగోలుగా కబ్జాలు చేసి బుడమేరుకు గండ్లు పడేలా చేశారని మండిపడ్డారు.
ఒక్కటీ ముప్పై టన్నుల బరువు ఉండే మూడు పడవలను ప్రకాశం బ్యారేజీలోకి వదిలేశారని, అవి వచ్చిన వేగానికి 15 టన్నుల బరువు ఉండే కౌంటర్ వెయిట్లు రెండు విరిగిపోయినట్లు సీఎం పేర్కొన్నారు. అవే పిల్లర్లను తాకి ఉంటే పెను ప్రమాదం వాటిల్లేదని తెలిపారు.