Thursday 22nd May 2025
12:07:03 PM
Home > తాజా > గెటప్ శ్రీనును చూస్తే ఆయనేగుర్తొస్తారు.. చిరంజీవి ప్రశంసలు!

గెటప్ శ్రీనును చూస్తే ఆయనేగుర్తొస్తారు.. చిరంజీవి ప్రశంసలు!

chiru srinu

Chiranjeevi Praises Getup Srinu | జబర్దస్త్ (Jabardast Comedian) కమెడియన్ గెటప్ శ్రీను (Getup Srinu) ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘రాజు యాదవ్’ (Raju Yadav). క్రిష్ణమాచారి (Krishnama Chary) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీను సరసన అంకితా కారత్ (Ankitha Kharat) నటిస్తున్నారు.

ఈ సినిమా మే 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా గెటప్ శ్రీనుపై ప్రశంసలు కురిపించారు.

ఈ జనరేషన్ కమెడియన్లలో తనకి బాగా నచ్చిన నటుడు గెటప్ శ్రీను అంటూ కితాబిచ్చారు. గెటప్ శ్రీనును చూస్తుంటే అప్పట్లో ఉన్న కామెడీ హీరో చలం (Chalam) గుర్తుకు వస్తారని చిరంజీవి చెప్పారు. రాజు యాదవ్ చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

You may also like
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’
పురుషులపై ఆసక్తి లేదు..పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions