Bill Gates News Latest | మైక్రోసాఫ్ట్ ( Microsoft ) వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ మేరకు ‘ సోర్స్ కోడ్- మై బిగినింగ్స్ ‘ ( Source Code: My Beginnings ) పేరిట బిల్ గేట్స్ ఓ పుస్తకాన్ని తీసుకువస్తున్నారు. ఇది ఫిబ్రవరి 4న మార్కెట్ లోకి విడుదల కానుంది. ఇందులో చిన్ననాటి జీవితం, తనకు ఎదురైన సవాళ్ల గురించి బిల్ గేట్స్ ప్రస్తావించినట్లు పీపుల్స్ మ్యాగజైన్ వెల్లడించింది.
అమ్మాయిలను ఆకట్టుకునేందుకు ఒకానొక సమయంలో బిల్ గేట్స్ నిషేధిత డ్రగ్ ఎల్ఎస్డీ ( LSD ) ని కూడా రుచి చూశారట. చిన్నతనంలో చాలా ప్రయోగాలు చేసినట్లు పుస్తకంలో వివరించారు.
అంతేకాకుండా తాను చిన్నప్పుడు ఆంటిజం అనే సమస్యతో బాధ పడినట్లు, తనను మాములు బాలుడిగా మార్చేందుకు తల్లిదండ్రులు పడిన కష్టం గురించి పుస్తకంలో బిల్ గేట్స్ పేర్కొన్నారు.