Thursday 6th August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఎల్పీజీ సిలిండర్ బరువు తగ్గింపు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం!

ఎల్పీజీ సిలిండర్ బరువు తగ్గింపు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం!

Gas Cylinder

LPG Cylinder | గృహ అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ (LPG) సిలిండర్ల బరువును తగ్గించబోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

సిలిండర్ బరువును 14.2 కిలోల నుంచి 10 కిలోలకు తగ్గిస్తున్నారనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది.

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో కొరతను అధిగమించేందుకు చమురు సంస్థలు గృహ వినియోగదారులకు అందించే సిలిండర్ల బరువును 14.2 కిలోల నుంచి 10 కిలోలకు తగ్గించి, తద్వారా ఎక్కువ మందికి సిలిండర్లను సరఫరా చేయాలని యోచిస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి. దీనివల్ల గ్యాస్ కొరత సమస్య ఉండదని ఆ కథనాల సారాంశం.

ఈ వార్తలపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ స్పందించారు. సిలిండర్ బరువు తగ్గింపుపై వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనని, ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని ఆమె స్పష్టం చేశారు.  ఇలాంటి నిరాధారమైన వార్తలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్రం సూచించింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions