Friday 11th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఢిల్లీ లిక్కర్ కేసు.. కవితకు మళ్లీ నోటీసులు!

ఢిల్లీ లిక్కర్ కేసు.. కవితకు మళ్లీ నోటీసులు!

kavitha

Delhi Liqour Case Update | ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liqour Case) కు సంబంధించి హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) ఇంటికి మరోసారి సీబీఐ అధికారులు వచ్చారు. మార్చి 16న విచారణకు హాజరవ్వాలని నోటీసులు అందించారు.

కాగా లిక్కర్ కేసుపై ఇటీవలే విచారణ చేపట్టిన ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు కేసులో కవితతో సహా నిందితులుగా ఉన్నవారి పేర్లను డిశ్చార్జ్ చేసింది. సరైన ఆధారాలు లేకుండానే వీరి పేర్లను చేర్చారని సీబీఐ పై ఆగ్రహం సైతం వ్యక్తం చేసింది.

అనంతరం రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలోనే సమన్లు జారీ చేసేందులు అధికారులు గురువారం కవిత ఇంటికి వచ్చారు. సీబీఐ నోటీసులపై కవిత స్పందించారు.

మద్యం పాలసీ కేసులో భాగంగా మార్చి 16న విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు స్వయంగా తెలియజేశారని కవిత తెలిపారు. ఈ విషయంపై లీగల్ టీమ్ తో చర్చిస్తున్నట్లు చెప్పారు. అలాగే అధికారులకు సంపూర్ణ సహకరం అందించనున్నట్లు తెలిపారు.

You may also like
1000 రోజుల కాంగ్రెస్ పాలన.. కల్వకుంట్ల కవిత విమర్శలు!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
కొత్త పార్టీ ఏర్పాటు దిశగా కవిత.. కీలక నేతతో భేటి?
kavitha kalvakuntla
సొంత పార్టీ నుంచే ఇబ్బందులు.. మండలిలో కవిత కన్నీటి ప్రసంగం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions