Sunday 11th May 2025
12:07:03 PM
Home > తాజా > ఇది ముమ్మాటికీ లవ్ జిహాదీ కేసు.. బీజేపీ మహిళా నేత సంచలన వ్యాఖ్యలు!

ఇది ముమ్మాటికీ లవ్ జిహాదీ కేసు.. బీజేపీ మహిళా నేత సంచలన వ్యాఖ్యలు!

Dr Shilpa Reddy

BJP Leader Shilpa Reddy | టాలీవుడ్ (Tollywood) లో జానీ మాస్టర్ (Jani Master) తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ మహిళా కొరియోగ్రాఫర్ (Choreographer) ఫిర్యాదు చేసిన ఘటన సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

తాజాగా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి (Shilpa Reddy) ఈ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. షేక్ జానీ పాషా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు.

మహిళా కొరియోగ్రాఫర్ మైనర్ గా ఉన్నప్ప టి నుంచే ఆమెపై వేధింపులకు పాల్ప డుతున్నా డని ఫిర్యా దులో పేర్కొ న్నా రని, అయినా ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేయకపోవడం బాధాకరమన్నారు.

ఇది ముమ్మాటికీ లవ్ జిహాదీ కేసు అని, ఇలాంటి ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నా నిమ్మ కు నీరెత్తినట్లు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తీరును ఖండిస్తున్నామన్నారు.

ఈ ఘటనను లవ్ జిహాదీ కేసుగా పరిగణిం చాలని, బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి. బాధితురాలికి న్యాయం జరిగే వరకు బీజేపీ మహిళా మోర్చా అండగా ఉంటుందని శిల్పా రెడ్డి భరోసా ఇచ్చారు.

You may also like
Jahnvi kapoor
మగాళ్లకు పీరియడ్స్ వస్తే.. జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
indiramma indlu
ఇందిరమ్మ ఇండ్లపై తొలి అడుగు.. ఖాతాల్లో రూ. లక్ష జమ!
ntr neel movie
NTRNeel సినిమా నుంచి కీలక అప్ డేట్!  
allu arjun gets interim bail
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్.. క్రేజీ వీడియో రిలీజ్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions