Delhi Police summons CM Revanth | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా కు సంబందించిన ఫేక్ వీడియో కేసులో (Amit Shah fake video case) పోలీసులు ఈ సమన్లు జారీ చేశారు. కాగా ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని ఇటీవల అమిత్ షా (Amit Shah) సిద్ధిపేట సభలో ప్రకటించిన విషయం తెల్సిందే.
అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ల రిజెర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా చెప్పినట్లు ఒక ఫేక్ వీడియో వైరల్ గా మారింది. ఈ క్రమంలో బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫేక్ వీడియో సర్కులేట్ విషయంలో సీఎం రేవంత్ కు సమన్లు జారీ చేశారు పోలీసులు. తెలంగాణ కాంగ్రెస్ యూనిట్ ఈ ఫేక్ వీడియోను సర్కులెట్ చేసారని పోలీసులు భావిస్తున్నారు.