Wednesday 5th August 2026
12:07:03 PM
Home > తాజా > బీఆరెస్ పార్టీకి మరో బిగ్ షాక్.. ఎమ్మెల్యే రాజీనామా!

బీఆరెస్ పార్టీకి మరో బిగ్ షాక్.. ఎమ్మెల్యే రాజీనామా!

MLA Resigns To BRS | తెలంగాణ ఎన్నికల ముందు అధికార బీఆరెస్ పార్టీ (BRS Party)కి మరో బిగ్ షాక్ తగిలింది.

నోటిఫికెషన్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటికే పలువురు నేతలు బీఆర్‌ఎస్‌‌ను వీడగా.. తాజాగా మరో ముఖ్యనేత గులాబీ పార్టీకి వీడ్కోలు చెప్పేశారు.

అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం (Abraham) బీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్ (Congress) పార్టీలో  చేరనున్నారు.

ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ (Sampath Kumar) ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమక్షంలో అబ్రహం హస్తం పార్టీలో చేరనున్నారు.

జూబ్లీహిల్స్ లోని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నివాసంలో అబ్రహం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు.

అయితే ఇప్పటికే అలంపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్‌కు చెందిన నలుగురు జెడ్పీటీసీలు, ముగ్గురు ఎంపీపీలు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు కాంగ్రెస్‌లో చేరారు.

You may also like
రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి: సీఎం రేవంత్
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
no permission for organizations on my name, says ktr
నా పేరుతో వాటికి అనుమతి లేదు: కేటీఆర్ 
kcr revanth
ఇదేక్కడి జాతిపిత లక్షణం.. కేసీఆర్ పై సీఎం రేవంత్ విమర్శలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions