Kajal Aggarwal Comments on Divorces | నేటి ఆధునిక జీవనశైలి, డిజిటల్ యుగంలో వైవాహిక బంధాలు ఎంత బలహీనపడుతున్నాయో ప్రముఖ కథానాయిక కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఆందోళన వ్యక్తం చేశారు.
సమాజంలో విడాకులు పెరిగిపోవడానికి ఓర్పు, సహనం తగ్గడంతో పాటు అతిగా సోషల్ మీడియా, స్మార్ట్ఫోన్లను ఉపయోగించడమే ప్రధాన కారణాలని ఆమె అభిప్రాయపడ్డారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్, నేటి తరం దంపతుల సంబంధాలు, మొబైల్ ఫోన్ల ప్రభావంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాటల్లేవ్.. ఓన్లీ స్క్రీన్స్..
చాలామంది జంటలు ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవడానికి కూడా సమయం కేటాయించడం లేదని కాజల్ గుర్తుచేశారు. చివరకు డిన్నర్ డేట్స్ లేదా హోటళ్లకు వెళ్లినా కూడా ఎదురెదురుగా కూర్చుని ఫోన్లలో స్క్రోలింగ్ చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి చిన్న విషయానికి సహనం కోల్పోవడం (Intolerance), కమ్యూనికేషన్ లోపించడం వల్ల దంపతుల మధ్య మనస్పర్ధలు వచ్చి అవి చివరికి విడాకులకు దారితీస్తున్నాయని అన్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి చెప్తూ.. తాను, తన భర్త గౌతమ్ కిచ్లూ కలిసి ప్రతి వారం తప్పకుండా డిన్నర్‌కి వెళ్తామని వెల్లడించారు.
ఆ సమయంలో ఫోన్లను పక్కనపెట్టి కేవలం ఒకరితో ఒకరు క్వాలిటీ టైమ్ గడుపుతూ అర్థవంతంగా మాట్లాడుకుంటామని తెలిపారు. నెటిజన్ల మద్దతు: బంధం బలంగా ఉండటానికి నిరంతర సంభాషణే ప్రధాన మూలస్తంభమని కాజల్ చెప్పిన మాటలకు నెటిజన్ల నుంచి విశేష మద్దతు లభిస్తోంది.











