- కేఎస్ఆర్టీసీ డ్రైవర్ పాల్ కురియన్ భావోద్వేగం
KSRTC Driver Paul Kurian Farewell కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (KSRTC)కి చెందిన సీనియర్ డ్రైవర్ పాల్ కురియన్ ఉద్యోగ విరమణ పొందారు. తన సుదీర్ఘ సర్వీసు ముగిసిన సందర్భంగా ఆయన బస్సును ముద్దాడి కన్నీటితో వీడ్కోలు పలికారు. ఈ భావోద్వేగ దృశ్యం చూసి అక్కడి ప్రయాణికులు, సిబ్బంది తీవ్రంగా చలించిపోయారు.
దశాబ్దాల కాలంగా ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన పాల్ కురియన్, తనకు జీవనోపాధిని ఇచ్చిన బస్సు పట్ల తన భక్తిని చాటుకున్నారు. చివరి ట్రిప్ ముగిసిన తర్వాత బస్సు స్టీరింగ్‌కు, ఇంజిన్‌కు నమస్కరించి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.
వైరల్‌గా మారిన వీడియో..
ఆయన వీడ్కోలుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధతను, క్రమశిక్షణను నెటిజన్లు కొనియాడుతున్నారు.







