Sunday 30th August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘Coolphabets’ యాప్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు!

‘Coolphabets’ యాప్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు!

Chandrababu Naidu Praises Coolphabets App “దేశ భాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన మన తెలుగు భాష మాటల్లోనే కాకుండా అక్షరాల్లోనూ తరతరాలకు సజీవంగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పిల్లలకు తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషలను నేర్పించే ‘Coolphabets’ అనే ఏఐ (AI) ఆధారిత యాప్‌ను ఆయన అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

సాంకేతికతతో భాషకు ఊపిరి – సీఎం వ్యాఖ్యలు..

నేటి డిజిటల్ తరంలో కూడా పిల్లలకు తెలుగు చదవడం, తెలుగు అక్షరాలు రాయడం అలవాటు కావాలని సీఎం ఆకాంక్షించారు. చిన్ననాటి నుంచే అక్షరంపై ఆసక్తి, భాషపై అభిమానం పెంచితేనే మన తెలుగు లిపి భావి తరాల్లో వెలుగుతుందని పేర్కొన్నారు.

Coolphabets యాప్ అభినందనలు..

పిల్లలకు ఆటపాటలతో పాటు తెలుగు మరియు భారతీయ భాషలను చదవడం, రాయడం నేర్పించేలా ఈ యాప్‌ను రూపొందించిన కొల్లు రంజిత్, వెంకట్ ఏలేటితో పాటు వారి బృందాన్ని సీఎం ప్రత్యేకంగా అభినందించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో పిల్లల చేతిరాతను పరిశీలించి, అవసరమైన మార్గదర్శకత్వం అందించేలా ఈ యాప్‌ను తీర్చిదిద్దడం హర్షణీయమన్నారు. సాంకేతికత మనల్ని భాషకు దూరం చేయకూడదని, మరింత చేరువ చేయాలని అభిప్రాయపడ్డారు.

మన భాష, మన లిపి మన సంస్కృతికి చిరునామా అని, తేనెలొలుకు తెలుగు భావితరాల్లోనూ చిరస్థాయిగా వెలుగొందాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

You may also like
కుప్పకూలిన 50 అడుగుల హై-మాస్ట్ లైట్.. తప్పిన పెను ప్రమాదం!
ADR Report: సీఎంల ఆస్తులు, కేసులు.. రేవంత్ టాప్, డీకే నంబర్-1
కుంకీ ఏనుగులకు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్!
pawan kalyan photo
ప్రభుత్వ ఆఫీసుల్లో డిప్యూటీ సీఎం ఫొటో.. హైకోర్టు ఏమందంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions