Wednesday 5th August 2026
12:07:03 PM
Home > క్రీడలు > క్రికెట్‌కు బ్రేక్.. ఆర్బీఐ అధికారిగా టీమిండియా స్టార్ బ్యాటర్!

క్రికెట్‌కు బ్రేక్.. ఆర్బీఐ అధికారిగా టీమిండియా స్టార్ బ్యాటర్!

Ishan Kishan As RBI Officer | టీమిండియా యంగ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ ప్రస్తుతం క్రికెట్ మైదానానికి దూరంగా ఉంటూ సరికొత్త అవతారంలో దర్శనమిచ్చారు.

మ్యాచ్‌లు ఏవీ షెడ్యూల్ కాకపోవడంతో లభించిన విరామ సమయాన్ని ఉపయోగించుకుని ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పాట్నా రీజనల్ ఆఫీస్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా విధుల్లోకి హాజరయ్యారు.

మెడలో ఆఫీస్ ఐడీ కార్డ్ ధరించి, ఫార్మల్ దుస్తులలో కొలీగ్స్‌తో కలిసి ముచ్చటిస్తూ, ఫోటోలకు ఫోజులిచ్చిన ఇషాన్ కిషన్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

స్పోర్ట్స్ కోటా ఉద్యోగం..

2017లో ఇషాన్ కిషన్‌ను ఆర్‌బీఐ స్పోర్ట్స్ కోటా (Sports Quota) కింద అసిస్టెంట్ మేనేజర్‌గా నియమించింది. ఆర్‌బీఐ ఉద్యోగిగా ఆయన డొమెస్టిక్ క్రికెట్‌లో ‘డివై పాటిల్’ వంటి పలు టోర్నమెంట్లలో ఆర్బీఐ జట్టు తరఫున ఆడారు.

అంతర్జాతీయ క్రికెట్ బిజీ షెడ్యూల్ వల్ల ఆఫీస్‌కు రావడం కుదరకపోయినా, లభించిన ఈ తాత్కాలిక బ్రేక్‌ను సద్వినియోగం చేసుకుంటూ ఆయన పాట్నా ఆఫీస్‌కు వెళ్లి తన బాధ్యతలను నెరవేర్చారు. స్టార్ క్రికెటర్ ఆఫీస్‌కు రావడంతో తోటి సిబ్బంది ఆయనతో సెల్ఫీలు దిగేందుకు తీవ్ర ఉత్సాహం చూపించారు.

You may also like
యువరాజ్ రికార్డ్ బ్రేక్..ఒకే ఓవర్ లో 39 పరుగులు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions