CM Revanth Reddy 20 Years Politics | తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన రెండు దశాబ్దాల (20 ఏళ్ల) సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ భరితమైన (Emotional) పోస్ట్ చేశారు.
2006లో మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ జెడ్పీటీసీ (ZPTC) సభ్యుడిగా ఒక స్వతంత్ర అభ్యర్థి (Independent) గా గెలుపొంది, ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన రేవంత్ రెడ్డి.. నాటి నుండి నేటి వరకు సాగిన తన రాజకీయ ప్రస్థానాన్ని నెమరువేసుకున్నారు.
శనివారంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చి సరిగ్గా 20 ఏళ్లు (CM Revanth Reddy 20 Years Politics) పూర్తి కావడంతో ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తెలంగాణ ప్రజలకు, తన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతూ సుదీర్ఘ సందేశాన్ని పంచుకున్నారు.
Read Also: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
మీ గుండెల్లో ‘రేవంతన్న’గా నిలిచా..
ప్రజా సేవలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకోవడం తన జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
“లక్షల అక్షరాలతో రాసినా…కోట్ల పదాలను కూర్చి చెప్పినా…తరగని మధుర జ్ఞాపకం…ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం.
నాడు మిడ్జిల్ లో రేవంత్ రెడ్డిగా మొదలై…నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం.” అని సీఎం రేవంత్ రాసుకొచ్చారు.
ఈ 20 ఏళ్ల ప్రయాణంలో ఎదురైన ప్రతి సందర్భంలో, ప్రతి సంఘర్షణలో మరియు ప్రజల పక్షాన తాను చేసిన ప్రతి పోరాటంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరినీ ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు.
తనతో నడిచిన ఆత్మీయులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, రాజకీయ కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు.
Read Also: రామమందిరం విరాళాల చోరీపై ఆర్‌ఎస్‌ఎస్ తీవ్ర ఆగ్రహం!
తెలంగాణ పునర్ నిర్మాణ శ్రామికుడిగా సేవ చేస్తా..
భవిష్యత్తులో కూడా ఇదే ప్రజా సేవా స్ఫూర్తితో ముందుకు సాగుతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
“ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఆర్తితో, మీ అందరి ఆశీర్వాద బలంతో భవిష్యత్తులో తెలంగాణ పునర్ నిర్మాణ శ్రామికుడిగా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా…
అన్నింటికీ మించి రేవంతన్నగా… మీ హృదయాల్లో నా స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని మాట ఇస్తున్నాను” అని ముఖ్యమంత్రి తన పోస్ట్ లో పేర్కొన్నారు.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
లక్షల అక్షరాలతో రాసినా…
— Revanth Reddy (@revanth_anumula) July 4, 2026
కోట్ల పదాలను కూర్చి చెప్పినా…
తరగని మధుర జ్ఞాపకం…
ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం.
నాడు మిడ్జిల్ లో రేవంత్ రెడ్డిగా మొదలై…
నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం.
ఈ 20 ఏళ్లలో ప్రతి… pic.twitter.com/cVyPl4rvJp







